telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

విజయవాడ ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదు: కలెక్టర్ ఇంతియాజ్

collector imtiyaz

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియజ్, పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించడం లేదని చెప్పారు.

కృష్ణలంక, ఖుద్దూస్ నగర్ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. సామూహిక సమావేశాల్లో పాల్గొనడం వల్లే కేసులు ఎక్కువ అయ్యాయని చెప్పారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని విన్నవించారు. లాక్ డౌన్ నిబంధనలను ఇకపై ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోలీస్ కమిషనర్ ద్వారాకా తిరుమలరావు మాట్లాడుతూ, ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు. రెడ్ జోన్ ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసరాలను సరఫరా చేస్తామని చెప్పారు. విధినిర్వహణలో ఉన్న 13 మంది పోలీసులకు, 12 మంది వాలంటీర్స్ కు వచ్చిందని తెలిపారు.

Related posts