telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనా సోకి భారతీయ సైంటిస్ట్ మృతి

Idian scientist geetharamjee

దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ బారిన పడి భారత సంతతి వైద్యురాలు (సైంటిస్ట్) మృతి చెందింది. గీతా రాంజీ (64) హెచ్ఐవీ ప్రివెన్షన్ రీసర్చ్ టీమ్ కు లీడర్ గా ఉన్నారు. వ్యాక్సిన్ సైంటిస్ట్ అయిన ఆమె… వారం క్రితమే లండన్ నుంచి డర్బన్ కు తిరిగొచ్చారు. ఆమెలో కరోనా లక్షణాలు కనపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.

ఆమె మృతి పట్ల సౌతాఫ్రికా మెడికల్ రీసర్చ్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సీఈవో గ్లెండా గ్రే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 2018లో యూరోపియన్ డెవలప్ మెంట్ క్లినికల్ ట్రయల్స్ పార్ట్ నర్ షిప్ ఆమెకు ఔట్ స్టాండింగ్ ఫిమేల్ సైంటిస్ట్ అవార్డును అందజేయడం గమనార్హం. గీతా రాంజీ అంత్యక్రియలకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. దక్షిణాఫ్రికాలో 21 రోజుల లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో అంత్యక్రియలకు హాజరయ్యే జనాల సంఖ్యపై తీవ్ర ఆంక్షలు ఉన్నాయి.

Related posts