telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కొడాలి నాని ఇంటివద్ద ఉద్రిక్త‌త‌

వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి జనసేన పార్టీ శ్రేణులు యత్నించారు.

దీంతో జనసేన కార్యకర్త ల‌ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరువురి మ‌ధ్య వాగ్వాదం జ‌ర‌గ‌డంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇక వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా .. తామేం నేరం చేశామంటూ కార్యకర్తలు  పోలీసులతో వాగ్వాదానికి దిగారు . దీంతో భారీగా పోలీసులు మోహరించారు. 

గోతులమయంగా ఉన్న కొడాలి నాని ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మొద్దు నిద్రపోతున్న సీఎం మేలుకోవాలంటూ ఫ్లకార్డుల ప్రదర్శన చేశారు.

కొడాలి నాని, పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు నేర్పడం మాని అధ్వానంగ ఉన్న గుడివాడ రోడ్లకు మరమ్మతులు చేయించాలని జనసేన పార్టీ నేతలు హితవుపలికారు.

Related posts