telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వానికి విద్యుత్ సంస్థల షాక్.. నేటి సమీక్షకు గైర్హాజర్!

jagan

ఏపీ ప్రభుత్వానికి విద్యుత్ సంస్థలు షాకిచ్చారు. విద్యుత్ ఒప్పందాలపై నేడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనుంది. అయితే ఈ సమీక్షకు హాజరుకాకూడదని కేంద్ర విద్యుత్ సంస్థలు ఎన్టీపీసీ, ఎస్‌ఈసీఐ నిర్ణయం తీసుకున్నాయి. ఒప్పందాలు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఒప్పందాలను గౌరవించి, పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిస్కంలకు ఎస్‌ఈసీఐ లేఖ రాసింది.

టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని సీఎం జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర ఇంధన శాఖ స్పందించిన విషయం తెలిసిందే. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికింది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని జగన్ ప్రకటన దెబ్బతీస్తుందని హితబోధచేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్ నిబంధనల ప్రకారమే జరుగుతాయని పేర్కొంది.

Related posts