telugu navyamedia
సినిమా వార్తలు

లలిత్ మోదీతో నటి సుస్మితా సేన్ డేటింట్‌.. త్వ‌ర‌లో పెళ్ళి

ఐపీఎల్ మాజీ చైర్మన్‌ లలిత్ మోదీ.. మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తో ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఈ విషయాన్న గురువారం సోషల్ వేదిక‌గా స్వయంగా లలిత్ మోదీ తెలిపారు.

వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నా పిక్స్‌ను లలిత్‌ మోదీ షేర్‌ చేశాడు. తొలి ట్వీట్‌లో సుస్మితను తన ‘బెటర్ హాఫ్’గా అభివర్ణించాడు. అయితే.. ఆ తర్వాత తన నెక్ట్స్ ట్వీట్లో, ఇద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదని.. డేటింగ్ లో ఉన్నామని స్పష్టం చేశాడు.

 ఈ విషయంపై నటి సుస్మితా సేన్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే.. ఆమె గత నెలలో మాల్దీవుల నుంచి పోస్ట్ చేసిన వాటిని నెటిజన్లు.. ఇప్పుడు సుస్మిత కొత్త సంబంధానికి లింక్ చేస్తున్నారు. (Instagram)

దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహరం మీడియాలో, సోషల్‌ మీడియాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటి వరకు సుస్మితా దీనిపై స్పందించలేదు. ఈ క్రమంలో మాల్దీవ్స్‌లోని స్వీమ్మింగ్‌ ఫూల్‌లో ఆమె ఒక్కతే ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీనికి బ్యాగ్రౌండ్‌లో ‘ఐ వాంట్‌ యు టూ నో.. యూ ఆర్‌ ద లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అనే ఇంగ్లిష్‌ సాంగ్‌ను జత చేసింది.

Was Sushmita Sen talking about boyfriend Lalit Modi in latest post about 'being planted'?

ఇక‌పోతే లలిత్ మోదీ వ్యాపార సామ్రాజ్యం నుంచి వచ్చారు. మీడియా నివేదికల ప్రకారం, లలిత్ మోడీ మొత్తం ఆస్తులు దాదాపు 57 మిలియన్ డాలర్లు అంటే రూ.4,555 కోట్లు.

సుస్మితా సేన్ ప్రతి నెలా 60 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ఆమె ఆస్తుల విలువ దాదాపు 74 కోట్లు. 46 ఏళ్ల సుస్మితా సేన్ ముంబైలోని వెర్సోవాలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు .

Throwback: Sushmita Sen and Rohman Shawl are one classy couple as they enjoy a boat ride | PINKVILLA

కాగా సుస్మితా గతంలో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్‌  రోహ్మన్‌ షాతో మూడేళ్లు డేటింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

 

Related posts