telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు.. : తమన్నా

tamanna on her marriage with media

హీరోయిన్ తమన్నాకు మిల్కీ బేబీగా ముద్దు పేరు. తెల్లని అందంతో పాలరాతి శిల్పంలా పరిమళించే ఈ హీరోయిన్ యూత్ గుండెల్లో ఎపుడో పర్మనెంట్ గా కాపురం పెట్టేసింది. పదేళ్ళ నుంచి టాలీవుడ్లో పాతుకుపోయిన తమ్మూ ఎన్నో హిట్లు కొట్టింది. యంగర్ జనరేషన్లోని హీరోలందరి సరసనా నటించిన తమ్మూకు తీరని కోరికలు ఇంకా ఉన్నాయట. డ్రైవింగ్ నేర్చుకోవడం, ఈత నేర్చుకోవడం వంటివి ఆమెకు ఇష్టమట. నటన నుంచి విరామం ప్రకటించే ముందు ఇవి తప్పనిసరిగా నేర్చుకుని తీరుతానని అంటోంది. మంచు మోహన్ బాబు రెండో కొడుకు మనోజ్ పక్కన జోడీగా శ్రీ మూవీతో పరిచయం అయిన తమ్మూ సీనియర్ నటి అయిపోయింది కానీ వయసు ఇంకా ముప్పయి దాటలేదు.

దానితో అమ్మడు ఇంకా యంగ్ కింద లెక్క. తాను ఇంకా మూవీస్ చెస్తూనే ఉంటానని, ఇపుడే పెళ్ళికి ఏం పెద్ద వయసని అంటోంది. ఇప్పట్లో ఆ వూసే వద్దంటూ ఖరాఖండీగా చెప్పేస్తోంది. తాను చాలా సినిమాలకు కమిట్ అయి ఉన్నానని కూడా అంటోంది. సైరాలో ఒక ముఖ్యపాత్రలో కనిపించబోతున్న తమ్మూ బేబీ, దటీజ్ మహాలక్ష్మి మూవీతో తెలుగులో మరో మారు పలకరించనుంది. అలాగే ఓ తమిళ్, ఓ హిందీ మూవీకి కూడా సైన్ చేసింది సో తమ్మూ పెళ్ళి ఇప్పట్లో లేదు. యూత్ హార్ట్స్ బ్రేక్ చేసుకోవాల్సిన పని అంతకంటే లేదన్న మాట!

Related posts