telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లోకేష్ ని పప్పు అంటారా… నాకు తెలీదే… : వర్మ

KRKR

టాలీవుడ్‌లో వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల నాటి పరిణామాల ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో స్పష్టమైంది. ఈ చిత్ర కథాంశాన్ని కాసేపు పక్కన పెడితే.. చిత్రంలో పాత్రధారుల విషయంలో వర్మ తన మార్క్‌ను చూపించారు. ఇది వివాదాస్పద పాత్రలతో అస్సలు వివాదాస్పదం కాని సినిమా అంటూ రామ్ గోపాల్ వర్మ చెబుతున్నా.. ఆయన చేసే ప్రచార కార్యక్రమాలు మాత్రం వివాదాస్పదంగానే ఉన్నాయి. ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. దీపావళి సందర్భంగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ట్రైలర్‌ను వర్మ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో ఆ రోజు టాప్ ట్రెండ్‌గా నిలిచింది. ఈ ట్రైలర్‌ను చూసిన తరవాత వర్మను తిట్టేవాళ్లు తిట్టారు, పొగిడే వాళ్లు పొగిడారు. అయితే, ఈ ట్రైలర్‌లో లోకేశ్ పాత్రధారికి చంద్రబాబు పాత్రధారి పప్పు వడ్డించే సన్నివేశం బాగా హైలైట్ అయ్యింది. అది ఎందుకు అయ్యిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సన్నివేశంపై తాజాగా తన అభిమాని ఒకరితో ఫోన్ కాల్ ద్వారా వర్మ డిస్కషన్ పెట్టారు. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాపై న్యూస్ ఛానెల్ 10టీవీ ప్రసారం చేసిన చర్చా కార్యక్రమంలో వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులతో వర్మ ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా కల్పించారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ట్రైలర్‌లో అన్నిటికన్నా పప్పు వడ్డించే సీన్ చాలా బాగా నచ్చిందని, హైలైట్ అని వర్మతో ఆ వ్యక్తి చెప్పాడు. ఎందుకు అంత బాగా నచ్చిందని వర్మ తిరిగి ప్రశ్నించారు. ఏపీ మాజీ ఐటీ మంత్రి లోకేశ్‌ను పప్పు అని అంటారని తెలిసే మీరు ఆ సీన్ పెట్టారని వర్మను డైరెక్ట్‌గా అనేశాడు ఆ వ్యక్తి. దీనికి వర్మ సమాధానం ఇస్తూ.. ‘‘లోకేశ్‌ని అలా అంటారా? నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ వింటున్నాను. లోకేశ్‌ను అలా అంటారని మీకు ఎవరు చెప్పారు?’’ అంటూ బాగా వెటకారంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో వచ్చే మెమీస్ ద్వారా లోకేశ్‌ను పప్పు అని అంటారని తనకు తెలుసని ఆ వ్యక్తి తిరిగి సమాధానం చెప్పాడు. ‘‘అవునా.. నేనైతే ఫస్ట్ టైమ్ వింటున్నా’’ అంటూ మరోసారి వెటకారంగా, తనదైన మ్యానరిజంతో అన్నారు వర్మ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Related posts