telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“డేంజరస్” అమ్మాయిలతో ఆర్జీవీ నైట్ పార్టీ

Dangerious

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న లెస్బియన్ లవ్ స్టోరీ ‘డేంజరస్’. ‘బ్యూటీపుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రలుగా ఈ ‘డేంజరస్’ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన రొమాంటిక్ పోస్టర్స్ ఇప్పటికే ఆన్‌లైన్ వేదికలపై వేడి పుట్టించాయి. ఈ సారి ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీని కెమెరాలో బందిస్తూ మరో అడల్ట్ కిక్కివ్వబోతున్నారు. ఓవర్ డోస్‌ రొమాన్స్‌తో మత్తెక్కించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ లొకేషన్ పిక్స్ షేర్ చేస్తూ గోవాలో ఇద్దరు హీరోయిన్లతో చేసిన పార్టీలు, అక్కడి షూటింగ్ సంగతులు చెప్పారు వర్మ. ఈ రొమాంటిక్ సినిమాను గోవాలోని అందమైన లొకేషన్స్‌లో షూట్ చేస్తున్నారు.

ఇందుకోసం చాలా రోజులుగా హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సర రాణిలతో అక్కడే ఉంటున్న ఆర్జీవీ.. తాజాగా ఆ హీరోయిన్లతో చిల్ అవుతున్న పిక్స్ షేర్ చేస్తూ ఓపెన్ అయ్యారు. గోవాలో కర్లీస్ అనే అందమైన ప్రదేశం ఉందని, అక్కడే పలు డేంజరస్ షాట్స్ షూటింగ్ చేస్తూ ప్రతిరాత్రి పార్టీలు చేసుకున్నామని చెప్పారు. ఈ మేరకు డేంజరస్ షూట్ కంప్లీట్ అయ్యాక.. ఇద్దరు అందాల భామలు నైనా గంగూలీ, అప్సర రాణిలతో నైట్ పార్టీలో తాను దిగిన ఫోటోలు షేర్ చేశారు వర్మ. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Related posts