telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..‌ ముగ్గురు ఉగ్రవాదులు మృతి

కశ్మీర్‌లోని షోపియాన్‌ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోపియాన్‌ ప్రాంతంలోని బడిగాంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు జమ్మూకశ్మీర్‌ పోలీసులకు సమచారం అందింది. దీంతో జమ్మూ కశ్మీర్‌ పోలీసులు సైనికులు, సీఆర్పీఎఫ్‌ బలగాలతో కలిసి గురువారం అర్ధరాత్రి కార్డన్‌ సెర్చ్‌ ప్రారంభించారు. ఒక ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు గాలిస్తున్న భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. యూరప్‌, ఇస్లామిక్ దేశాల ప్రతినిధులు, రాయబారుల బృందం జమ్మూకశ్మీర్‌లో సందర్శిస్తున్న సమయంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌ స్థలంలో పోలీసులు ఉగ్రవాదుల కోసం శుక్రవారం ఉదయం కూడా గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts