సమంత, నాగశౌర్య ప్రధాన పాత్రలలో నటించిన “ఓ బేబీ” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సీనియర్ నటి లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో ‘నాలో మైమరపు’ పాటకి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి షూటింగ్ సమయంలో తమ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.
ఈ వీడియోలో ముందుగా సమంత “రొమాంటిక్ సాంగ్స్ చేయడంలో నాగశౌర్య వరస్ట్” అంటూ నవ్వేసింది. దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెబుతూ ”సెట్స్ లో శౌర్య ఉన్నాడంటే నాకు టెన్షన్ మొదలవుతుంది.. హీరోయిన్ ఎక్కడ ఉన్నా ఆమెకి ఇరవై అడుగుల దూరంలో శౌర్య ఉంటాడు” అంటూ చెప్పుకొచ్చింది. అలాంటి వ్యక్తిని సమంత బాగా హ్యాండిల్ చేసిందని, శౌర్యకి, సమంతకి కుక్కలంటే చాలా ఇష్టమని ఇద్దరూ అదే మాట్లాడుకుంటూ పాటని కంప్లీట్ చేశారని వెల్లడించింది. స్క్రీన్ పై వీరిద్దరి జంట అంత ఫ్రెష్ గా ఉంటుందని ఊహించలేదని తెలిపింది. కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
#NaaloMaimarapu behind the scenes
Featuring @Samanthaprabhu2 and @IamNagashaurya
Music by @MickeyJMeyer@nandureddy4u | @SureshProdns | @peoplemediafcy | @gurufilms1 | @kross_pictures | @adityamusic#OhBabyOnjuly5 pic.twitter.com/4pBORoZmA9— BARaju (@baraju_SuperHit) June 10, 2019
నేను ప్రేమించబోయే వ్యక్తి యువకుడా, వృద్ధుడా అనేది అనవసరం : రకుల్