telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బియర్ గ్రిల్స్ “మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్”లో రజినీకాంత్

Rajinikanth

డిస్క‌వ‌రీ ఛాన‌ల్‌లో వ‌చ్చే మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీతో క‌లిసి ఉత్త‌రాఖండ్‌లో ఓ షో చేసిన బ్రిటీష్ సాహ‌సికుడు బియ‌ర్ గ్రిల్స్. ఇప్పుడు ఆ షోలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌నిపించ‌నున్నారు. మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ షో కోసం ర‌జ‌నీతో ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నారు. గ్రిల్స్‌.. ఇప్పుడు ఫిల్మ్ స్టార్ ర‌జ‌నీతోనూ షో చేస్తున్నాడు. క‌ర్నాట‌క‌లోని బందిపుర్ అడ‌వుల్లో ఈ షూటింగ్ జ‌రుగుతున్న‌ది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ కోసం షూటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. షూటింగ్ కోసం క‌ర్నాట‌క ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. బందిపుర అభ‌యార‌ణ్యంలో పులులు ఉన్నాయి. మొత్తం నాలుగు లొకేష‌న్ల‌లో షూటింగ్ కోసం ప‌ర్మిష‌న్ ఇచ్చారు. బందిపుర వైల్డ్ లైఫ్ పార్క్‌, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ కోసం ఇద్ద‌రు స్టార్స్ మాట్లాడ‌నున్నారు. ఫిల్మ్ స్టార్ ర‌జ‌నీకాంత్ .. ప్ర‌స్తుతం బందిపుర రిసార్ట్‌లో ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు.

Related posts