telugu navyamedia
సినిమా వార్తలు

బండ్ల గ‌ణేష్ ‘డేగల బాబ్జీ’ ట్రైలర్ విడుద‌ల‌..

నటుడిగా, నిర్మాత‌గా అల‌రించిన బండ్ల గ‌ణేష్ ఇప్పుడు హీరోగా ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డేగల బాబ్జీ’. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహించారు.

తమిళ్‌లో పార్థిబన్ హీరోగా నటించిన బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ కి‌ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు గాను పార్థిబన్ కు జాతీయ పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో బండ్లగణేష్ మెయిన్ లీడ్ గా డేగల బాబ్జి పేరుతో రీమేక్ చేస్తున్నారు.

Degala Babji trailer: Bandla Ganesh steps into the shoes of Parthiban in  what's his biggest test as an actor

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన ‘డేగల బాబ్జీ’ పాత్రలో బండ్ల గణేష్ నటన ఆకట్టుకుంటోంది.

ఈ ట్రైలర్‌లో బొద్దుగా ఉన్న మా అమ్మ అందంగానే ఉంటుంది.. ‘అసలు అమ్మ అందంగా ఉండాలన్న రూల్‌ ఏమైనా ఉందా?’, ‘పుట్టగానే వాడు అస‌లు ఏడవలేదు.. కానీ వాడు పుట్టినప్పటి నుంచి మేం ఏడుస్తూనే ఉన్నాం’ అంటూ బండ్ల గణేశ్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

మరోవైపు ఈ మూవీలో అన్ని రకాల ఎమోషన్స్‌ను పండిస్తూ బండ్ల గణేష్ చూపించిన హావభావాలు అంద‌రినీ మెప్పించేలా ఉన్నాయి. . యష్ రిషి ఫిలింస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.

Related posts