telugu navyamedia
సినిమా వార్తలు

“బిగ్ బాస్-3”: కంటెస్టెంట్ గా తీన్మార్ సావిత్రి

Savithri

బుల్లితెరపై మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా మొదలై ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకొంది. ప్రస్తుతం మూడో సీజన్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. కంటెస్టంట్ లను కన్ఫర్మ్ చేశారని ఓ లిస్ట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో కొత్త పేరు వచ్చి చేరింది. అదే తీన్మార్ సావిత్రి. బిగ్ బాస్ షోలో ఈమె కూడా పార్టిసిపేట్ చేయబోతుందని టాక్. కొన్నేళ్లుగా వి6 ఛానెల్ లో ప్రసారం అవుతోన్న తీన్మార్ వార్తలతో సావిత్రి అలియాస్ జ్యోతి బాగా ఫేమస్ అయింది. తెలంగాణా అమ్మాయిగా షోలో ఆమె ఎంట్రీ ఉండవచ్చని అంటున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెని సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే సావిత్రి ఈ షోలో ఎంట్రీ ఇవ్వడానికి ఓకే చెప్పిందా ? లేదా ? అనేది చూడాలి. ఇక ఈ షోకు హోస్ట్ గా నాగార్జునను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.

Related posts