telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ కోసం పరుగు పెట్టిన దర్శకుడికి నాగార్జున వార్నింగ్

nagarjuna

నాగార్జునకు ఇప్పుడు ఓ దర్శకుడు చాలా కోపం తెప్పించాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య సినిమాకు కమిట్ అయి ఓ స్టార్ హీరో ఆఫర్ ఇచ్చాడని వెంటనే అక్కడికి వెళ్లిన ఆ దర్శకుడికి నాగార్జున క్లాస్ పీకాడని తెలుస్తుంది. ఆయనెవరో కాదు పరుశురామ్. గీత గోవిందం సినిమా తర్వాత రెండేళ్లకు ఈ మధ్యే నాగ చైతన్య సినిమాకు కమిటయ్యాడు ఈ దర్శకుడు. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ అయిపోగానే పరుశురామ్ సినిమా మొదలు పెట్టాలి నాగ చైతన్య. అయితే ఇప్పుడు మహేష్ బాబు సినిమా వచ్చిందని చైతూను వదిలేసి అక్కడికి వెళ్లాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. దాంతో నాగార్జునకు చిర్రెత్తుకొచ్చిందని తెలుస్తుంది. ఆ దర్శకుడి తీరుతో నాగ్ చాలా అసహనానికి లోనయ్యాడని ప్రచారం జరుగుతుంది. ఎంత మహేష్ బాబు ఆఫర్ ఇస్తే మాత్రం తన కొడుకుని కాదని వెళ్తాడా అంటూ నాగ్ ఫైర్ అయ్యాడని అతడి కోసం ఆగాల్సిన అవసరం లేదు కమిటైన సినిమాలను పూర్తి చేయాలంటూ కొడుక్కి కూడా నాగార్జున చెప్పాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోవడంతో పరుశురామ్‌కు కబురు పెట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. దాంతో నాగ చైతన్యను వదిలేసి మహేష్ కోసం పరుగు పెట్టాడు ఈ దర్శకుడు. దాంతో నాగార్జున బాగా హర్ట్ అయ్యాడని తెలుస్తుంది.

Related posts