telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విచారణలో పలువురు సినీ పెద్దల పేర్లు వెల్లడించిన రియా ?

Rhea

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత జూన్ నెల 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసే విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ కు సంబంధించిన విషయాలపై ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఎన్సీబీ విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. షోవిక్, మిరాండాల ద్వారా సుశాంత్ కోసం డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టు రియా అంగీకరించింది. దీంతో అధికారులు మరింత లోతుగా ఈ కేసును విచారిస్తున్నారు. కాగా ఈ విచారణలో రియా పలువురు సినీ పెద్దల పేర్లు వెల్లడించిందని తెలుస్తుంది. “కేధార్ నాథ్” సినిమా షూటింగ్ సమయంలో సుశాంత్ తన కోస్టార్స్ తో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని రియా అధికారులకు వెల్లడించిందని తెలుస్తుంది. సుశాంత్ డ్రగ్స్ తీసుకుంటున్న విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడని, అతని స్టాఫ్ మెంబర్స్ ద్వారా డ్రగ్స్ డెలివరీ అవుతుంటాయని రియా పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రియా సోదరుడు శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేసారు పోలీసులు.

Related posts