telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

‘జగనన్న జీవ క్రాంతి’కి నేడు శ్రీకారం…

cm Jagan tirumala

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి పథకాలతో దూసుకుపోతుంది. సీఎం జగన్‌ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారు. దీంతో ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతోంది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలనున తీసుకువచ్చిన సీఎం జగన్‌… మరో పథకానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం జగన్‌ ఇవాళ “జగన్న జీవక్రాంతి ” పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు రూ. 1868.63 కోట్లు వ్యయం చేయనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ ఈ కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ల కొనుగోలు, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకాన్ని మూడు విడుతలుగా అమలు చేయనున్నారు.

Related posts