telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

కృష్టా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం కృష్టా జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టగా ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ పుణ్య క్షేత్రానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారు ఖమ్మం జిల్లాలోని మధిరకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాగా.. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక వృద్ధుడు ఉన్నారు. ఈ కారులో డ్రైవర్‌తో పాటు 9 మంది ప్రయాణిస్తుండగా… ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది 

Related posts