telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మళ్లీ ప్రారంభమైన వరద సాయం…రెండ్రోజుల్లో 17,333 మందికి పంపిణీ

hard cash

వరదలతో హైదరాబాద్ ప్రజలు గత నెలలో తీవ్రంగా నష‌్టపోయిన విషయం తెలిసిందే. అయితే… వరద బాధితులకు ఆదుకునేందుకు కుటుంబానికి రూ. 10 వేలు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే చాలా మందికి ఇవ్వగా… ఈ ప్రక్రియ గ్రేటర్ ఎన్నిక తర‌్వాత మళ్లీ మొదలైంది. వరదలతో అతలాకుతలమైన బాధితులకు అందించే సాయం పంపిణీ ప్రక్రియ మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభమైంది. ఈ రెండురోజుల్లో 17,333 మందికి రూ.17.33 కోట్ల సాయాన్ని అందించినట్లు జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది. బల్దియా ఎన్నికల కారణంగా నిలిచిన సహాయ పంపిణీ మంగళవారం నుంచి తిరిగి ప్రారంభం కాగా, మొదటిరోజు 7939 మంది బాధితులకు రూ.7.90 కోట్లు, బుధవారం 9394 మందికి రూ.9.39 కోట్లను వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది. ఇప్పటికే మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, అర్హులకు వారి బ్యాంకు ఖాతాకే నగదును బదిలీ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. వరద సాయం పంపిణీలో జీహెచ్‌ఎంసీ నిస్సహాయత వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, సాయం పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

Related posts