telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కొడాలి నాని త‌ప్ప ఏ నాని తెలీదు..

టికెట్ రేట్లు తగ్గించి ఏపీ ప్రభుత్వం ప్రేక్షకులను అవమానించిందని హీరో నాని వ్యాఖ్యానించారు. థియేటర్ కంటే పక్కన ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయని నాని మాటాల‌కు వైసీపీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ స్పందిస్తూ.. . తమకు ఏ నానీలు తెలియదని.. తెలిసిందల్లా కొడాలి నాని అన్న ఒక్కరని సెటైర్లు వేశారు.

ఏపీ ప్రభుత్వం టికెట్‌ రేట్లు తగ్గించడం వల్ల ప్రజలు హర్షిస్తుంటే హీరోలకు కడుపు మంట ఎందుకని , వారి రెమ్యునరేషన్‌ కూడా తగ్గుతుందని హీరోలు బాధపడుతున్నారని మంత్రి అనిల్ అన్నారు.

భీమ్లా నాయక్‌, వకీల్‌ సాబ్‌ వంటి సినిమాలకి పెట్టిన ఖర్చు ఎంత? పవన్‌కల్యాణ్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఎంత? చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలని ఉద్దరిస్తానన్న పవన్‌ కల్యాణ్ తక్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు కదా అని అన్నారు. పవన్‌ కల్యాణ్ తన క్రేజ్‌ని అమ్ముకుంటున్నారని విమర్శించారు. మంత్రి అనిల్‌ నెల్లూరులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తమకు ఏ నానీలు తెలియదని.. తెలిసిందల్లా కొడాలి నాని అన్న ఒక్కరని సెటైర్లు వేశారు.

‘‘ఒకప్పుడు నేను కూడా బైక్‌ అమ్మి పవన్‌ కల్యాణ్‌కి కటౌట్‌లు కట్టాను. ఉన్న డబ్బులు అన్ని అవ్వగొట్టుకున్నా. ఇప్పుడున్న అభిమానుల పరిస్థితి కూడా అంతే. సినిమా ప్రొడక్షన్ ఖర్చు 30 శాతమైతే… సినిమా హీరోల రెమ్యూనరేషన్ 70 శాతం ఉంటోందని ఆయన అన్నారు. సినిమాకు అయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకే వెళ్తున్నాయి. దానికోసం కోట్లాది మంది ప్రజలపై భారం పడేలా సినిమా రేట్లు పెంచమని అనడం ఎంతవరకు కరెక్టు.

సినిమా ప‌రిశ్ర‌మ‌లో జరిగే దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సినిమా ఖర్చులో 70 శాతం హీరోల రెమ్యునరేషనే ఉంటోంది. హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా?. హీరోలు రెమ్యునరేషన్ తగ్గిస్తే సినిమా టికెట్ల ధర తగ్గుతుందని మంత్రి అన్నారు.

Related posts