telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉన్న ఒక్క జనసేన ఎమ్మెల్యేనూ లాక్కునేందుకు కుట్ర: పవన్

pawan-kalyan

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పార్టీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి మనపై కక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. ఉన్న ఒక్క జనసేన ఎమ్మెల్యేనూ లాక్కునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాపాకపై పలు కేసులు పెట్టారన్నారని అన్నారు.

మూడేళ్ల నుంచి పోరాటం చేసి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవాళ్లమని పవన్‌ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బు పంచడంవైసీపీ కే సాధ్యమైందని, అందుకే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. వివేకా హత్య కేసు విచారణలో ఎందుకు వేగం లేదు? నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యేపై కేసు ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. 

Related posts