telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనాకు క్లోరోక్విన్ సమర్థవంతం: డొనాల్డ్ ట్రంప్

trump usa

మలేరియాను నిరోధించే క్లోరోక్విన్ సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తక్షణమే ఈ డ్రగ్ ను పెద్దఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని ఇది దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) గొప్పదనమని వ్యాఖ్యానించారు. యాంటీ బయాటిక్ అజిత్రో మైసిన్ తో కలిపి క్లోరోక్విన్ ను తీసుకుంటే, వ్యాధి బారిన పడిన వారిలో వైరస్ స్థాయి గణనీయంగా తగ్గిందని ఆయన అన్నారు.

కాగా, క్లోరోక్విన్ ప్రభావవంతంగా పని చేస్తోందని ఇప్పటికే చైనా అధికారికంగా ప్రకటించింది. కొవిడ్ టీకా తయారీకి పెద్దఎత్తున జరుగుతున్న ట్రయల్స్ లోనూ కార్యకర్తలకు క్లోరోక్విన్ ను ఇస్తున్నారు. మరోవైపు దక్షిణ కొరియా, బెల్జియం తదితర దేశాలు కరోనాకు విరుగుడుగా ఇదే ఔషధాలను వాడుతున్నాయి. ఏప్రిల్ నాటికి కొవిడ్ నిరోధక వాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు.

Related posts