telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా విస్తరించకుండా చర్యలు: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్

china version changed in J & K issue

కరోనా వైరస్ విస్తరించకుండా తగు చర్యలు చేపట్టి, ప్రాథమికంగా విజయం సాధించినట్టు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ తొలిసారి వెలుగు చూసిన వూహాన్‌లో ఆయన నిన్న పర్యటించారు. వూహాన్‌కు విమానంలో వచ్చిన జిన్ పింగ్.. ముఖానికి మాస్క్‌తో పలు ప్రాంతాల్లో పర్యటించారు. వూహాన్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఫ్రంట్‌లైన్ మెడికల్ వర్కర్లు, రోగులతో వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. అక్కడి నుంచి హాన్‌లోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కు వెళ్లి ప్రజలు, సామాజిక కార్యకర్తలతో మాట్లాడారు.

అనంతరం మీడియాతో జిన్‌పింగ్ మాట్లాడుతూ ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరించకుండా హుబేయి ప్రావిన్స్, వూహాన్‌లో కట్టడి చేసినట్టు చెప్పారు. పరిస్థితిని అదుపు చేయడంలో, తిరిగి మునుపటి పరిస్థితులను నెలకొల్పడంలో ప్రాథమికంగా విజయం సాధించినట్టు చెప్పారు. అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో హుబేయి అధికారులు కీలక ప్రకటన చేశారు. వైరస్ ప్రబలిన తర్వాత వూహాన్, సెంట్రల్ హుబేయి ప్రాంతాలను దిగ్బంధించిన అధికారులు రాకపోకలను నిషేధించారు.

Related posts