telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

సీఎం జగన్ ఉద్యమానికి ఊపిరి పోశారు…

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందన ఉద్యమానికి ఊపిరి పోసినట్లయిందని, బడ్జెట్ సమావేశాల్లో స్టీల్ ప్లాంటుకు అనుకూలంగా తీర్మానం చేస్తామని సీఎం చెప్పడం శుభపరిణామం అని అన్నారు. కేంద్రం ఆలోచనకి మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారని అన్నారు. పోస్కో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లయితే శ్రీకాకుళం జిల్లా భావనపాడులో గాని కృష్ణపట్నంలో గాని కడప లో గాని అవకాశం ఇస్తామని చెప్పారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సపోర్ట్ చేస్తున్నామని సీఎం జగన్ అన్నారని అన్నారు. మా డిమాండ్లు అన్నిటికీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్న నాయకులు,  అవసరమైతే అసెంబ్లీ లో తీర్మానం చేస్తామని చెప్పారని అన్నారు. నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని మాట ఇచ్చారని అన్నారు. కార్మిక సంఘాలతో పాటు ప్రభుత్వం ఉమ్మడిగా పోరాటం చేస్తుందని తెలిపారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఐరన్ ఓర్ లు ఇవ్వాలని కోరామని, ఒరిస్సాలోని ఎన్ఎండిసితో కూడా మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు.  ఆ ప్రతిపాదన ఒప్పుకోకపోతే కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేస్తామన్నారని వారు పేర్కొన్నారు. 

Related posts