telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో 18 వేల పోలీస్ సిబ్బంది నియామకాలు: డీజీపీ మహేందర్‌ రెడ్డి

Mahender-Reddy

భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభత్వం ఒకేసారి 18 వేల పోలీస్ సిబ్బంది నియామకాలు చేపట్టడం గొప్ప విషయమని డీజీపీ మహేందర్‌ రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఒకే విధమైన సేవలను అందించేవిధంగా కృషి చేస్తున్నామని అన్నారు.

బాధితులు ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చందానగర్ పోలీసులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని నేరాల అదుపునకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలలో భద్రతా భావాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో ఇక్కడి సిబ్బంది స్కిల్ డెవలప్‌మెంట్‌ను పెంపొందించుకొని సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ని అనుసరిస్తూ, కోర్టులలో ఉన్న పెండింగ్ కేసులను ఎప్పడికప్పుడు క్లియర్ చేస్తున్నారని పేర్కొన్నారు.

Related posts