telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

150 మంది సైనికులకు కరోనా పాజిటివ్…

భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించే పరేడ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది… దీని కోసం వివిధ బెటాలియన్ల నుంచి కొంతమంది జవాన్లను సెలక్ట్ చేసి ఢిల్లీకి పంపడం.. ఆ తర్వాత వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం చేస్తుంటారు. అయితే, పరేడ్‌లో పాల్గొనడానికి ఇప్పటికే ఢిల్లీకి వచ్చిన 150 మంది సైనికులు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.. దేశరాజధాని ఢిల్లీలో కరోనా వేవ్ కొనసాగుతూనే ఉంది.. కవాతుల్లో పాల్గొనడానికి వచ్చిన సైనికులను సేఫ్‌ బబుల్‌లో వేయడానికి ముందు కోవివ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు.. దీంతో.. 150 మంది జవాన్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. అయితే, వీరిలో కొందరికి ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని.. అయినా.. ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఐసోలేషన్‌లో ఉంచినట్టు చెబుతున్నారు అధికారులు. పరేడ్‌కు హాజరయ్యేందుకు వేలాది మంది ఢిల్లీకి రాగా.. ఇప్పుడు 150 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో మిగతా వారిలో ఆందోళన మొదలైంది. కాగా, రిపబ్లిక్‌ డే కవాతును సురక్షితంగా నిర్వహించడానికి ప్రోటోకాల్స్ ఉంచినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.. మరోవైపు.. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 26న రాజ్‌పథ్‌లో కవాతు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు అధికారులు.. ఇప్పటికే యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ముఖ్యఅతిథిగా భారత్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Related posts