telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫసల్ బీమా పథకానికి సర్కార్ మంగళం: ఉత్తమ్ ఫైర్

uttam congress mp

విపత్తులతో దెబ్బతిన్న రైతుల పంటల కోసం ప్రధాని ఫసల్ యోజన పథకంలో కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకుందన్న వార్తలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఫసల్ బీమా పథకంలో తన వాటాను తగ్గించుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు.

కేసీఆర్ ప్రభుత్వం ఈ బీమా పథకానికి మొత్తానికే మంగళం పాడేసిందని ఉత్తమ్ మండిపడ్డారు. కేంద్రం, ఇటు రాష్ట్రం పరస్పర బాధ్యతల నుండి తప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. భారీ వర్షాలతో రైతన్నకు జరిగిన తీవ్ర నష్టాన్ని ఎవరు పూడ్చుతారని నిలదీశారు.

బీమాపాయె అంటూ ఓ పత్రికలో కథనం ప్రచురించింది. కేంద్ర సర్కారు తన వాటా తగ్గించుకుందని, బీమా పథకానికి ప్రీమియం కట్టడం భారమని రాష్ట్ర ప్రభుత్వం పథకాన్నే నిలిపివేసిందని పేర్కొన్నారు. ప్రీమియం చెల్లించలేక పిట్టకథలు చెబుతున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. ఆ కథనం క్లిప్పింగ్ ను ట్విటర్ లో ఉత్తమ్ పోస్ట్ చేశారు.

Related posts