telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈరోజు నుండి తెలంగాణ‌లో పాస్‌పోర్ట్ సేవ‌ల‌కు బ్రేక్

Air India flight

తెలంగాణ పాస్‌పోర్ట్ సేవ‌ల‌పై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈరోజు నుంచి రాష్ట్రంలో పాస్ పోర్ట్ సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.. మే 14వ తేదీ వ‌ర‌కు పాస్‌పోస్టు సేవ‌లు నిలిచిపోనున్నాయి.. క‌రోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం పాస్‌పోర్టు సేవ‌ల‌ను నిలిపివేస్తూ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని అధికారులు చెబుతున్నారు.. రాష్ట్రంలోని 14 త‌పాలా సేవా కేంద్రాల ద్వారా ప్ర‌భుత్వం పాస్‌పోస్టు సేవ‌ల‌ను అందిస్తుండ‌గా.. తాజా నిర్ణ‌యంతో.. గురువారం నుంచి మూత‌ప‌డ‌నున్నాయి… క‌రోనా దృష్ట్యా ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి ద‌ర‌ఖాస్తు దారులు స‌హ‌క‌రించాల‌ని అధికారులు విజ్ఞ‌ప్తి చేశారు. ఇక‌, మే 14 త‌రువాత అప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పాస్‌పోర్టు సేవాల‌ను తిరిగి ప్రారంభించ‌డంపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే.

Related posts