telugu navyamedia
రాజకీయ

పంజాబ్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌..

 

*పంజాబ్‌ సీఎం అభ్య‌ర్థిత్వంపై తెర ప‌డింది..

*పేదల కష్టాన్ని ఓ పేద బిడ్డ మాత్రమే అర్థం చేసుకుంటారు..

*కార్మికుల అభిమతం మేరకు చన్నీని ప్రకట‌న‌..

అసెంబ్లీ ఎన్నికలు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు కాంగ్రెస్‌ పార్టీ తెరదించింది. పోటీ చేసే ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ ఆదివారం ప్రకటించింది . ప్ర‌స్తుత సీఎం చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చెన్నీయే పంజాబ్ సీఎం అభ్య‌ర్థి అని కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌నేత‌ రాహుల్ గాంధీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

దీంతో పంజాబ్‌ కాంగ్రెస్ అభ్య‌ర్థిత్వంపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి, మరొకవైపు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ, కాంగ్రెస్ అధిష్ఠానం ల మ‌ధ్య హోరా హోరీగా మాట‌ల యుద్ధం సాగింది. ఈ వివాదానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధిష్టానం చరణ్‌జిత్ సింగ్ చన్నీకే మొగ్గు చూపింద‌నీ, చన్నీనే కాంగ్రెస్ తరపు సీఎం అభ్యర్థి అని రాహుల్ గాంధీ ప్రకటించారు.

Punjab polls: Congress announces Charanjit Singh Channi as its CM face - Elections News

లూథియానాలో ఆదివారం జరిగిన వర్చువల్‌ ఎన్నికల ప్రచారంలో పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీ ఈ మేరకు ప్రకటించారు. వ్యక్తం చేస్తూ ఆయన పేరును ప్రకటించారు. చన్నీజీ ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు అహం లేదని, ప్రజల్లోకి వెళతారని రాహుల్ గాంధీ అన్నారు.

సీఎం అభ్యర్థిని నిర్ణయించడం ఇబ్బందికర పరిస్థితే. అయితే, పేదల కష్టాన్ని ఓ పేద బిడ్డ మాత్రమే అర్థం చేసుకుంటారని పంజాబ్‌ ప్రజలు భావిస్తున్నార‌ని, పం జాబ్‌కు ఆ వ్యక్తి అవసరమని రాహుల్ గాంధీ అన్నారు. పంజాబ్ ప్రజలు, కార్మికుల అభిమతం మేరకు చన్నీని ప్రకటిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు.

Related posts