telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

వాట్సాప్ కు .. బయోమెట్రిక్ లాక్ వచ్చేసింది…

finger print lock to whatsapp in available

వినియోగదారులు పెరుగుతుండటంతో అభియోగాలు పెరుగుతుండటంతో వాట్సాప్ కూడా కొత్త కొత్త ఫీచర్లు తీసుకొచ్చి కొత్తవారిని ఆకర్షించేప్రయత్నిస్తుంది. కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎన్నో కొత్త ఫీచర్లు కూడా ప్రవేశపెట్టింది. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఫింగర్ ప్రింట్ ఆన్లాక్ వచ్చేసింది. కొన్ని నెలలుగా బీటా సెట్టింగ్ చేసిన తర్వాత మొత్తానికి ప్రస్తుతం యూజర్లకు ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ రిలీజ్ చేసింది వాట్సాప్. ఆండ్రాయిడ్ ఫోన్ లో వాట్సాప్ యూజర్స్ ఇప్పుడు ఫింగర్ ప్రింట్ లాక్ ఇన్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చని వాట్స్అప్ తెలిపింది.

మీ వాట్సప్ చాట్స్ కు బయోమెట్రిక్ సెక్యూరిటీ ఇప్పటి నుంచి లభించనుంది. ఎన్ని రోజుల వరకు వాట్స్అప్ లాక్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ ని ఉపయోగించాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం వాట్సాప్ ప్రత్యేకంగా ఫింగర్ ప్రింట్ లాక్ ఫ్యూచర్ ని వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది. దీనితో వినియోగదారులు మరింత పెరిగే అవకాశం ఉందని సంస్థ ఆశిస్తుంది.

Related posts