telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేటీఆర్‌కు ఆమరణ నిరాహార దీక్ష సవాల్‌ చేసిన ఎంపీ రేవంత్‌

revanth shabbir ali

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ అంశం అధికార టీఆర్‌ఎస్‌, విపక్షాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంపీ రేవంత్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పున‌ర్‌నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ 2013 విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌ర్చిన‌ విభ‌జ‌న హామీల‌నూ ర‌ద్దు చేసే అధికారం మోడీకి ఎవ‌రు ఇచ్చారని ఫైర్‌ అయ్యారు. రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ, ఐటిఐఆర్‌లనూ ర‌ద్దు చేస్తే మోడీని కేసీఆర్ ఎందుకు నిల‌దీయ‌డం లేదని… విభ‌జ‌న హామీల‌పై ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర ఇద్ద‌రం క‌లిసి ఆమ‌ర‌ణ నిర‌హార దీక్ష‌ చేద్దామని.. దీనికి కేటీఆర్ సిద్ధమా అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రాష్ట్రానికి రావాల్సిన హామీలు, నిధుల‌పై ఇద్ద‌రం క‌లిసి మోడీపై యుద్ధం చేద్దామని..దీనికి కేటీఆర్ సిద్ద‌మా అని పేర్కొన్నారు. గ‌ల్లీలో బిజెపితో వైర్యం…ఢిల్లీలో దోస్తానా చేస్తున్నారని…ఇద్ద‌రు తోడు దొంగ‌లే అని ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌, న‌రేంద్ర‌మోడీ క‌లిసి యువ‌త‌నూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్ర‌శ్నించే గొంతులు అసెంబ్లీలో అడుగు పెట్ట‌కుండా కేసీఆర్ కుట్ర‌లు చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌, మోడీ జోడి దేశాన్ని స్వ‌ర నాశ‌నం చేసే దాకా నిద్ర‌పోదని ఫైర్‌ అయ్యారు. మోడీ మోసం చేస్తే.. మోడీ తీసుకొచ్చిన ప్ర‌తి బిల్లుకు ఎందుకు మ‌ద్ద‌తు ఇచ్చారని… కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అంటే..మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌న్నారని గుర్తు చేశారు. మ‌తం, కులం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ‌గొట్టి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుతున్నారని నిప్పులు చెరిగారు.

Related posts