telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీలో కేఏపాల్‌ ఆమరణ దీక్ష..కారణమిదే

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం రోజు రోజు ఉదృతమౌతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. అటు విశాఖ స్టీల్‌ ఉద్యమానికి ఇప్పటికే తెలంగాణ కీలక నేత, మంత్రి కేటీఆర్‌ అలాగే మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు పలికారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు వెనక్కి తగ్గవద్దని పిలుపునిచ్చారు. అయినప్పటికీ…కేంద్ర ప్రభుత్వం మాత్రం… స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని మొండిపట్టు పట్టింది. అయితే.. తాజాగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 21 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు వేసినట్లు తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు పాల్‌ సంఘీభావం తెలిపారు. అంతేకాదు..సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Related posts