ఆస్పత్రుల్లో కోవిడ్ సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడి చర్యలపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 104, 14410 కాల్ సెంటర్లు సమర్థవంతగా పనిచేయాలన్నారు. కాల్ సెంటర్ సేవలపైన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయాలని జగన్ చెప్పారు.
ఎప్పటికప్పుడు వస్తున్న లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. టెలిమెడిసిన్ కింద మందులు పొందిన వారికి మళ్లీ పోన్‌చేసి సేవలపై ఆరా తీయాలని అన్నారు. అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. స్కూళ్లు తెరిచే సమయానికి పిల్లలకు మాస్కులు ఇవ్వాలని ఆదేశించారు. ఆరోగ్య శ్రీ సేవలందిస్తున్న ఆస్పత్రులు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
కుప్పం కెనాల్ పనుల నిలిపివేతపై చంద్రబాబు ఫైర్