telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కెమెరామెన్‌పై గొర్రె ఫోకస్… సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో

BBC

బీబీసీ ఛానల్ వైల్డ్‌లైఫ్‌కు సంబంధించి ఓ కార్యక్రమం చేయదలుచుకుంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్‌లో ఉన్న సఫారీ పార్కుకు బీబీసీ సిబ్బంది వెళ్లింది. ఆ పార్క్‌లో సెసిలి అనే ఓ గొర్రె ఉంది. ఆ గొర్రెను పార్కులో ఉన్న వారంతా రౌడీ అని పిలుస్తుంటారు. అంతలా అది అల్లరి చేస్తుందట. ఎవరైనా తనకు నచ్చని పనిచేస్తే వెంటనే తన కొమ్ములతో ఎదుటివారిని కుమ్ముతుంది. పైనున్న వీడియోను గమనిస్తే గొర్రెకు ఆహారం వేస్తున్న మహిళను కొమ్ములతో పొడవటం చూడచ్చు. ఇక బీబీస్ కెమెరామెన్‌కు సెసిలీతో ఎదురైన అనుభవం తన జీవితంలో మర్చిపోలేడు. అతడే కాదు ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా కెమెరామెన్‌కు జరిగిన సంఘటనను మర్చిపోలేరు. అంతలా ఈ గొర్రె ఏం చేసిందంటే.. కెమెరామెన్ గొర్రెను జూమ్‌లో తీయదలచి గొర్రె దగ్గరకు కెమెరాను తీసుకెళ్లాడు. తాను కింద కూర్చుని గొర్రె ముఖంపై కెమెరా ఫోకస్ చేశాడు. తనపై కెమెరామెన్ ఫోకస్ చేయగా.. కెమెరామెన్‌పై గొర్రె ఫోకస్ చేసింది. వెంటనే ఆ గొర్రె ఏకంగా చెప్పుకోలేని ప్లేస్‌లో కుమ్మింది. వీడియో చివర్లో ఈ దృశ్యం కనిపిస్తుంది. గొర్రె కొమ్ములతో పొడిచిన వెంటనే కెమెరామెన్ ఒక్కసారిగా పక్కకు పడిపోయాడు. ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరు హాస్యంగా స్పందిస్తున్నారు.

Related posts