telugu navyamedia
వార్తలు

ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..

ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.. గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 43,733 పాజిటివ్ కేసులు న‌మోదం అయ్యాయి. అయితే,ఇందులో రెండొంతులకు పైన కేసులు ఒక్క కేరళలోనే నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. ఆ రాష్ట్రంలో 30,203 కేసులు బయటపడ్డాయి. మంగళవారం తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెర‌గ‌డం ప్ర‌జ‌ల‌ల్లో ఆందోళ‌న క‌ల‌గ‌జేస్తుంది.

India witnesses dip in fresh COVID-19 cases but new fatalities increase in last 24 hours | India News | Zee News

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది. 24 గంటల వ్యవధిలో 33,964 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3.19కోట్ల మందికి పైనే కరోనా ను జయించగా.. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 97.18శాతానికి చేరింది.

మరోవైపు వైరస్‌ ప్రభావంతో మరో 930 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో 115 మరణాలు ఒక్క కేరళ లోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలోమహమ్మారి ప్రభావంతో 4,04,211 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,59,920 యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 97.18శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.39శాతంగా ఉందని తెలిపింది.

Footprint of B.1.617 now spreads to 44 countries | Latest News India - Hindustan Times

ఒక్కరోజే 1.33కోట్ల డోసుల పంపిణీ
టీకా పంపిణీలో భారత్ మరోసారి రికార్డు సృష్టించింది. ఆగస్టు 27న తొలిసారి 24గంటల్లో కోటి డోసులకు పైగా పంపిణీ చేయగా.. నిన్న ఆ రికార్డును తిరగరాసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 1.33కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 65.41 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు సమాచారం.

India reports 62,224 fresh Covid cases, 2,542 deaths; active cases below 9 lakh after 70 days

Related posts