telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

టాప్ లో కొనసాగుతున్న .. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్…

slight positive trend in stock markets

ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు స్టాక్ మార్కెట్‌లో దూసుకెళ్లి సరికొత్త రికార్డును నమోదు చేసింది. దీంతో మార్కెట్‌ క్యాప్‌ పరంగా దేశంలో మొట్టమొదటి అతిపెద్ద కంపెనీగా ఆర్ఐఎల్ అవతరించింది. రిలయన్స్ తరువాతి స్థానాలలో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిలిచాయి. ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్ షేరు సరికొత్త శిఖరాలను తాకింది. ఒక దశలో 3.4 శాతం లాభపడి, రూ.1,508.45తో బీఎస్‌ఈలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. దీంతో రిలయన్స్‌ రూ .9.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన సంస్థగా రికార్డు సృష్టించింది. అంతేకాదు, అతి త్వరలోనే పది లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ క్యాప్‌ను సాధించే దిశగా కూడా పరుగులు పెడుతోంది. 1966లో ఒకే ఒక్క ఉద్యోగితో, కేవలం రూ.1000 మూలధనంతో (అప్పటికి130 డాలర్లతో) ధీరూబాయ్ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. ఆ తరువాత ఆయన తన కలను సాకారం చేసుకున్నారు.

రిలయన్స్‌ను ప్రపంచ స్థాయి వ్యాపార దిగ్గజ కంపెనీగా తీర్చిదిద్దారు. 1977లో ఈ కంపెనీ ఐపీవోకు వచ్చింది. ఆ తరువాత నుంచి ప్రతి రెండున్నర ఏళ్లకు రిలయన్స్ షేరు విలువ రెట్టింపు అవుతూ వస్తోంది. 2019 ఒక్క ఏడాదిలోనే రిలయన్స్ షేరు ధర ఇప్పటి వరకు 35 శాతం పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 18న, 9 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన మొదటి భారతీయ సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 9.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను అధిగమించి 10 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించే దిశగా పరుగులు తీస్తోంది. దేశీయ కంపెనీల మార్కెట్ విలువ విషయానికి వస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా.. ఇక ఈ రేసులో రెండో స్థానంలో నిలిచిన ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ విలువ రూ .7.91 లక్షల కోట్లు. కాగా.. మూడో స్థానంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్‌ క్యాప్ ఇటీవల రూ .7 లక్షల కోట్ల మైలురాయిని దాటింది.

Related posts