వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దుల పరంపర కొనసాగుతుందని విమర్శించారు. పాలన కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయారనిదుయ్యబట్టారు. నవరత్నాలు పేరుతో ప్రజలను మోసం చేస్తోందని ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.
మరో టీడీపీ నేత చినరాజప్ప మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరుగురు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, అన్ని రంగాల కార్మికులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.
స్మిత్ పరుగుల ఆకలి మీద ఉన్నాడు : పాంటింగ్