telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌” టీజర్ వచ్చేసింది…!

ETGD

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఇండో చైనీస్ చిత్రం ‘ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌’. పూజా బాలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. రవిశంకర్ మ్యూజిక్ అందించగా.. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ మూవీని జింగ్ లీ, నరేశ్ టీ, శ్రీధర్ టీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారత్‌లో నిర్మిస్తున్న తొలి మార్షల్ ఆర్ట్ చిత్రం ఇదేనని చెబుతున్నాడు వర్మ. తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా టీజర్‌ను బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా ఇవాళ ట్విటర్లో విడుదల చేశారు. బ్రూస్‌లీ యూనివర్సల్ బర్త్ టైం ప్రకారం ఇవాళ 3:12 గంటలకు టీజర్‌ను ట్విటర్లో రిలీజ్ చేశాడు వర్మ. వచ్చే నెల 13వ తేదీన చిత్ర ట్రైలర్‌ను బ్రూస్ లీ సొంత నగరం చైనాలోని ఫోషన్ సిటీలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

Related posts