telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమితాబ్ పరిస్థితి విషమం… తీవ్ర అనారోగ్యం

Amitab-Bachchan

బాలీవుడ్ మెగాస్టార్ 77 ఏళ్ళ వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇప్పటికీ భారీ క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అమితాబ్. ఒక్క బాలీవుడ్ లోనే కాదు తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఏ భాషలోనైనా నటించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. 200కి పైగా చిత్రాల్లో నటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. సినీ పరిశ్రమకు చేసిన విశిష్ట సేవలు చేసిన ఈ అరుదైన నటుడికి ఇటీవలే ప్రతిష్ఠాత్మక “దాదాసాహెబ్‌ ఫాల్కే” అవార్డు దక్కిన విషయం తెలిసిందే. కాగా అమితాబ్ బచ్చన్ కాలేయ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో అమితాబ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారని సమాచారం అందుతోంది. ముంబై నగరంలోని నానావతి ఆస్పత్రిలో అమితాబ్ బచ్చన్ కు చికిత్స జరుగుతోందని మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో అమితాబ్ బచ్చన్ ను ఆస్పత్రిలో చేర్చారని తెలుస్తోంది. వెంటిలేటర్ పై ఆయనకు సేవలందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడాలని అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. కొద్దీ గంటలు గడిస్తే గాని ఏది చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.

కొన్ని రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యానికి సంబంధించి షాకింగ్ విషయం బయటపెట్టారు. అమితాబ్ బచ్చన్ స్వస్థ్ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ తనకు క్షయ వ్యాధి సోకిన సంగతి వ్యాధి సోకిన 8 సంవత్సరాల వరకు తెలియదని, ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకోవటంతో వైద్య పరీక్షల్లో క్షయ వ్యాధి ఉందని తెలిసిందని అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు. రెగ్యులర్ గా మెడికల్ చెకప్ చేయించుకోకపోవటం వలన క్షయ సోకిందనే విషయం ఆలస్యంగా తెలిసిందని అన్నారు. ఇప్పటికే 75 శాతం లివర్ పూర్తిగా చెడిపోయిందని కేవలం 25 శాతం లివర్ తోనే సర్వైవ్ అవుతున్నానని అమితాబ్ బచ్చన్ గతంలో చెప్పారు.

Related posts