కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన “కేజీఎఫ్” చిత్రం దాదాపు 200 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. కన్నడలోనే కాక తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యువ హీరో యశ్ ప్రధాన పాత్రలో మూవీ రూపొందుతుంది. ఫస్ట్ పార్ట్‌లో అధీరా అనే పాత్రని సస్పెన్స్‌లో పెట్టిన మేకర్స్ ఆ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని జూలై 29 విడుదల చేశారు. అధీరా పాత్రలో దత్తు భాయ్ అదరగొట్టారు. ఇక ఫస్ట్ లుక్ కోసం కొన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న అభిమానులకి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు . డిసెంబర్ 21 సాయంత్రం 5.45ని.లకి ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. శ్రీనిధి శెట్టి చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. హోమ్‌బేల్ ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగాన్ని మించి యాక్షన్, మాఫియా ఉంటాయట. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్‌లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు.