telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తిరుపతి ఎన్నికలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయి..

Somu Veerraju BJP

తిరుపతి ఉప ఎన్నిక, జనసేనతో పొత్తు విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక విషయాలు బయటపెట్టారు. రాష్ట్రంలో జనసేనతో కలిసి అనుసరించే రాజకీయ వ్యూహాలపై చర్చించామని….
జనవరి 4న మేమందరం రామతీర్థం వెళ్తున్నామని.. అక్కడ భారీ నిరసన కార్యక్రమం చేపడతామని స్పష్పం చేశారు. ఒక్క రామతీర్థం మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని… శ్రీశైలంలో టీడీపీ హయాంలో రబ్బానీ, వైకాపా హయాంలో రఫీ వ్యవహారం చూశామన్నారు సోము వీర్రాజు. దేవాలయాలపై దాడుల విషయంలో రాజకీయాలు చేస్తున్నారనడం సరికాదని…. అసలు అందుకు అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు సోము వీర్రాజు. ఆలయాలపై దాడులు రాజకీయ అంశం కాదని…. ఆత్మాభిమానం స్వాభిమానానికి సంబంధించిన అంశమని తెలిపారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని.. అభ్యర్థి ఎవరనే విషయంపై తొందరేమీ లేదన్నారు. జనసేన-బీజేపీకి ఆ విషయంలో స్పష్టత ఉందని తెలిపారు సోము వీర్రాజు.

Related posts