telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

అమ్మవారి గుడిలో అద్భుతం.. హారతి సమయంలో మారిన ముఖ కవళికలు!

UjjainiBonalu ammavaaru

సృష్టిలో కొన్ని నమ్మలేని వింతలు జరుగుతుంటాయి. మనం వాటిని కళ్ళతో చూసినప్పటికీ నమ్మాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోతుంటాం. నిజంగా అలా జరిగిందా అని షాక్ అవుతుంటాం. అలాంటి అద్భుత దృశ్యం ఒకటి హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని మీర్ ఆలం మండిలో ఉన్న శ్రీ మహాంకాళేశ్వర స్వామి ఆలయంలో దుర్గామాత దేవి విగ్రహం ఉన్నది. ఆ విగ్రహానికి హారతి ఇచ్చే సమయంలో అమ్మవారి ముఖకవళికలు మారిపోవడం ఓ భక్తుడు గమనించాడు.

తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఏం జరిగిందోతెలుసుకోవాలని తాను చూసింది నిజమేనా అనే డైలామాలో పడ్డాడు. క్రమంలో ఎందుకైనా మంచిది అని ఆ హారతి ఇచ్చే సన్నివేశాన్ని వీడియో తీశారు. వీడియోలో తాను చూసింది నిజమే అయ్యింది. అమ్మవారికి హారతి ఇచ్చే సమయంలో హారతి దిశకు అనుగుణంగా అమ్మవారి ముఖ కవళికలు మారిపోతున్నాయి. ఈ చిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దాదాపు 53 వేలమందికి పైగా వీడియోను వీక్షించారు. అమ్మవారి విగ్రహాన్ని అంత అద్బుతముగా చెక్కిన శిల్పి గొప్పదనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. అలాంటి దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. బహుశా మీర్ ఆలయంలోని మహాకాళేశ్వర మందిరానికి అంతటి పేరు రావడానికి ఇలాంటి అద్భుతం జరగడమే కారణం కావచ్చు. అమ్మవారి విగ్రహ స్వరూపాన్ని గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. అమ్మవారి ఆలయాన్ని మీరుకూడా దర్శించుకుంటే ఆ అనుభూతిని మీరుకూడా ఆస్వాదించవచ్చు.

Related posts