telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

భారత ఆటగాళ్లు నియమాలు ఉలంఘించలేదు : బీసీసీఐ

కరోనా అనంతరం భారత్ మొదటిసారిగా ఆసీస్ పర్యటనకు వెళ్ళింది. అయితే కరోనా సమయం కాబట్టి అందులో ఆడే ఆటగాళ్లు అందరూ కరోనా నియమాలు పాటించాలి. అయితే బయో-సేఫ్టీ బబుల్ ప్రోటోకాల్స్ ను ఐదుగురు భారత ఆటగాళ్ళు ఉల్లంఘించారు అనే వార్తను బీసీసీఐ కొట్టిపారేసింది. కరోనా ప్రోటోకాల్స్ ప్రకారమే రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుబ్మాన్ గిల్, పృథ్వీ షా మరియు నవదీప్ సైని హోటల్ కు వెళ్లారు అని ఓ బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. అంతేకాని కరోనా ప్రోటోకాల్‌లను ప్రభావితం చేసే విధంగా ఆటగాళ్ళు ఏం చేయలేదని… భారత ఆటగాళ్లకు కరోనా నియమాలు తెలుసు అని బోర్డు స్పష్టం చేసింది. అయితే మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు రోహిత్‌, పంత్‌, గిల్‌, సైని, షా లంచ్‌కు వెళ్లారు. వారని అక్కడ చూసిన అభిమాని నవల్దీప్‌ సింగ్‌ వారికే తెలియకుండా వారి లంచ్‌ బిల్‌ 6వేల రూపాయలు కట్టాడు. దీనికి సంబంధిచిన ఓ పోస్ట్ ను ట్విట్టర్ లో పెట్టి చివరకు పంత్ నన్ను హగ్‌ చేసుకున్నాడు అని తెలిపాడు. ఇప్పుడు అదే ఈ వివాదానికి కారణం కావడంతో పంత్ నన్ను హగ్ చేసుకోలేదు అని మరో పోస్ట్ చేసాడు. అయితే ప్రస్తుతం ఈ ఐదుగురు ఆటగాళ్లు ఐసొలేషన్ లో ఉన్నారు. ఈ ఘటన పై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ జరుపుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts