telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో కొత్త పార్టీ : హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు !

వైఎస్‌ షర్మిల పార్టీ పెడతారనే వార్తలు రాగానే.. తెలంగాణలోని అన్ని పార్టీలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ఏపీ పార్టీ తెలంగాణలో అవసరమా.. ఫ్యాక్షన్‌ రాజకీయాలు ఇక్కడ రుద్దుతారా అని తెలంగాణ లోని అన్ని పార్టీలు మండిపడ్డాయి. అయితే.. తాజాగా మంత్రి హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ వచ్చాక మంచి‌ నీటి బాధ లేకుండా ‌చేసిందని… అదే టీడీపీ ఉండగా పవర్ బిల్లులు ముక్కు పిండి వసూలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ అని చెప్పి ఉత్త విద్యుత్ ఇచ్చిందని.. సీఎంగా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అర్థరాత్రి దొంగ కరెంటు ఇచ్చారని నిప్పులు చెరిగారు. ఆనాడు రైతు చనిపోతే రూపాయి ఇవ్వలేదని… కానీ ఇప్పుడు రైతు చనిపోతే ఐదు లక్షల బీమా మొత్తం‌ రైతుల ఇంటికి పంపుతున్నామని పేర్కొన్నారు. కొద్ది మంది టీఆర్ఎస్ ఏం చేసిందని అడుగుతున్నారని… ఉచిత కరెంటు, రైతుకు పెట్టుబడి సాయం, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇలా ఎంతో చేశామని గుర్తు చేశారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు రాయితీలో ఇచ్చేందుకు సీఎం యోచన చేస్తున్నారని… రైతు బాగు కోసం సీఎం నిత్యం ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక రెండు కోట్ల ఎకరాలు ఏడాది పాటు సాగు అవుతున్నాయన్నారు.

Related posts