telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

ఐడియా .. సరికొత్త ఆఫర్లు..

idea cellular new offers on yearly basis

ఐడియా సెల్యులార్ రూ.999, రూ.1,999 ల పేరిట రెండు నూత‌న ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను తాజాగా లాంచ్ చేసింది. రూ.999 ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 12 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణ‌యించారు.

రూ.1,999 ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 365 రోజులే కావ‌డం విశేషం. రూ.999 ప్లాన్ కేవ‌లం పంజాబ్ స‌ర్కిల్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌గా, రూ.1,999 ప్లాన్ కేర‌ళ స‌ర్కిల్ క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే ల‌భిస్తున్న‌ది.

త్వ‌ర‌లో ఈ రెండు ప్లాన్లు దేశంలోని ఇత‌ర ఐడియా సెల్యులార్ ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా ల‌భ్యం కానున్నాయి.

Related posts