telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఉత్తర భారత్ లో వరుసగా చనిపోతున్న పక్షులు…

2019 లో వచ్చిన కరోనా నుండే ప్రపంచం ఇంకా బయటపడలేదు. అంతలోనే యూకే నుంచి వచ్చిన కొత్త స్ట్రెయిన్ భయపెడుతోంది. అయితే ఈ భయాలు ఇలా ఉండగానే మన దేశాన్ని మరో భయం వెంటాడుతోంది.  ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక పక్షులు మృత్యువాత పడుతున్నాయి.  ఇటీవలే రాజస్థాన్ లోని ఝూలాబాద్ జిల్లాలో వందకు పైగా కాకులు మృతి చెందాయి.  చనిపోయిన కాకులను పరిశీలించగా బర్ద్ ఫ్లూ సోకిందని వైద్యులు చెప్పారు.  అయితే, ఈరోజు నాగౌర్ జిల్లా కల్వా గ్రామంలో 50 నెమళ్ళు అనుమానాస్పద రీతిలో మృతి చెందాయి.  దీంతో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.  వరసగా కాకులు, నెమళ్ళు మృతి చెందుతుండటంతో చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యింది.  రాజస్థాన్ లోనే కాకుండా ఇండోర్ లో కూడా ఇటీవలే 50కి పైగా కాకులు మృతి చెందాయి.  హిమాచల్ ప్రదేశ్ లో బాతులా కనిపించే బార్ హెడెడ్ గూస్ పక్షులు 1000 వరకు మృతి చెందాయి.  దీంతో ఉత్తర భారతంలో ఏం జరుగుతుందో, ఇది దేనికి సంకేతమో అని ప్రజలు భయపడుతున్నారు. చూడాలి మరి ఈ ఘటన పై అక్కడి ప్రభుత్వాలు ఏం చేస్తాయి అనేది.

Related posts