శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి శు.షష్ఠి రా.3.32 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం స్వాతి ఉ.11.16 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం సా.4.40 నుంచి 6.14 వరకుదుర్ముహూర్తం ప.11.33 నుంచి 12.23 వరకుఅమృతఘడియలు… రా.1.56 నుంచి 2.34 వరకు.
సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.09
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం :
మేషం : ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. భూవివాదాల పరిష్కారం. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
వృషభం : కార్యజయం. ఆస్తి ఒప్పందాలు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
మిథునం : వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
కర్కాటకం : సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
సింహం : సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.
కన్య : బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
తుల : పాతబాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృశ్చికం : ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
ధనుస్సు : పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. దూరపు బంధువుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
మకరం : నూతన ఉద్యోగప్రాప్తి. సమాజసేవలో భాగస్వాములవుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు.
కుంభం : సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
మీనం : మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం. – సింహంభట్ల సుబ్బారావు