telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

వైరస్ ను అడ్డుకునే సరికొత్త మాస్క్!

mask corona

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్న నేపథ్యంలో స్విట్జర్లాండ్ కు చెందిన ఓ సంస్థ వినూత్న మాస్క్ ను తయారు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా దగ్గినా, తుమ్మినా, కరోనా వైరస్ క్రిములు మాస్క్ పై పడితే, అవి వెంటనే చనిపోయేలా పనిచేసే మాస్క్ ను లివింగ్ గార్డ్ తయారు చేసింది. ఈ మాస్క్ లో భిన్నమైన వస్త్రాన్ని, రసాయనిక బంధాల పోగుల ద్వారా తయారు చేశామని, దీనిపై ప్రతిక్షణం 0.1 నుంచి 0.8 మిల్లీ ఓట్ల ధనాత్మక విద్యుదావేశం పుడుతూ ఉంటుందని, దాని ద్వారా వైరస్ క్రిములు నశిస్తాయని సంస్థ వెల్లడించింది.

కొవిడ్-19 వైరస్ తో పాటు పలు రకాల బ్యాక్టీరియాలను ఇది నశింపజేస్తుందని సంస్థ తెలిపింది. ఈ మాస్క్ లో ప్రతి చదరపు సెంటీమీటర్ కూ 2,600 కోట్ల విద్యుదావేశాలు పుడతాయని, దీన్ని తాకగానే, వైరస్ పై పొరలు పేలి, అవి మరణించడం లేదా నిర్వీర్యం కావడం జరుగుతుందని సంస్థ సీటీవో, భారత సంతతి శాస్త్రవేత్త సంజీవ్ స్వామి వెల్లడించారు.ఈ మాస్క్ లను వాడిన తరువాత, తిరిగి ఉతుక్కుని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ మాస్క్ ల ధర విషయానికి వస్తే, ఒక్కో మాస్క్ ఖరీదు రూ. 1,490 నుంచి రూ. 1,990 మధ్య ఉంటుందని సంస్థ ప్రకటించింది.

Related posts