telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈ-మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై సీఎం జగన్ సమీక్ష

cm jagan ycp

ఏపీ సీఎం జగన్ ఈ-మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్బీకే పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ-క్రాపింగ్ పై మార్గదర్శకాలు, ఎస్ పీవోలను రూపొందించాలని స్పష్టం చేశారు.

ఈ-క్రాపింగ్ విధానాలను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఉంచాలని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారని తెలిపారు. 30 శాతం పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

Related posts