telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కరోనాను జయించడమే అందరి లక్ష్యం: బాలకృష్ణ

Balakrishna tdp

కరోనాను జయించడమే అందరి లక్ష్యమని టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ అన్నారు. కరోనా పోరులో ప్రభుత్వాలు భాధ్యతగా పని చేయాలని అన్నారు. అదే సమయంలో ప్రజలు కూడా అంతే భాద్యతాయుతంగా ఉండి తమను తాము పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు. వాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

త్వరలోనే వాక్సిన్ రావాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఇప్పటికే ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారని ఈ ప్లాస్మా వలన చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారని వివరించారు. ఈ రోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కు మహేశ్వర మెడికల్ కాలేజి మరియు హాస్పిటల్, సంగారెడ్డి వారు కోవిడ్ కిట్స్ అందజేశారు. వీటిని హాస్పిటల్ తరపున శ్రీ బాలకృష్ణ స్వయంగా శ్రీ టీజీ ఎస్ మహేష్, ఛైర్మన్, మహేశ్వర మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్, సంగారెడ్డి చేతుల మీదుగా స్వీకరించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ శ్రీ మహేష్ గారు కోవిడ్ మహమ్మారి తో పోరాటంలో చేస్తున్న సహాయం ఎంతో మేలు కలిగిస్తోందని ప్రశంసించారు. మెడికల్ కాలేజీ గా వైద్య చికిత్సకే పరిమితం కాకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మహేష్ గారు తన వంతు పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

కార్యక్రమ అనంతరం మీడియా తో మాట్లాడిన సందర్భంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ షూటింగ్ లకు ప్రభుత్వ అనుమతి ఇపుడే వచ్చిందని, త్వరలోనే దీనిపై పరిశ్రమ పెద్దలందరూ కూచుని చర్చించుకొని నిర్ణయం తీసుకొంటమని శ్రీ బాలకృష్ణ అన్నారు. షూటింగ్ లు అంటే చాలా మంది ఉంటారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.

Related posts