telugu navyamedia
క్రీడలు వార్తలు

కరోనాతో సీనియర్ సినిమాటోగ్రాఫర్ జయరాం మృతి…

సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే గురువారం రాత్రి కన్నుమూశారు. అటు మలయాళం, ఇటు తెలుగు సినిమా రంగంలోనూ సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారాయన. తెలుగులో నందమూరి తారక రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకూ, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకూ ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచుకున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆయన సినిమాటోగ్రఫీలోనే ‘పెళ్లి సందడి’ చిత్రం రూపొందింది. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Related posts